Araku: విజయవాడ వచ్చీ రాగానే అరకు, పాడేరుకు పయనమవుతున్న చంద్రబాబు!

  • మధ్యాహ్నం ఒంటిగంటకు పాడేరుకు సీఎం
  • కిడారి కుటుంబానికి పరామర్శ
  • ఆపై అరకులో సివేరి సోమ ఇంటికి చంద్రబాబు

ఐక్యరాజ్యసమితిలో వ్యవసాయంపై ప్రసంగించేందుకు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తన విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న వెంటనే అరకులో పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు ఆయన పాడేరు, అరకు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పాడేరు చేరుకోనున్న ఆయన, ఇటీవల మావోల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఆపై అరకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులనూ పరామర్శిస్తారు. కాగా, ఇప్పటికే అరకు, పాడేరు ప్రాంతాన్ని పోలీసులు, కూంబింగ్ దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. నిన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ అరకు, డుంబ్రిగూడ, లివిటిపుట్టు ప్రాంతాల్లో పర్యటించి, కిడారిని హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. వీఐపీల పర్యటనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

Araku
Paderu
Chandrababu
Kidari
  • Loading...

More Telugu News