ranabeer kapoor: కరణ్ జొహార్ 'బ్లాక్ బస్టర్' ముచ్చట!

  • క్యాప్షన్ ఫొటోకి సంబంధించింది కాదు
  • ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ట్రైలర్‌ని ప్రదర్శించిన రణబీర్ 
  • ట్రైలర్‌ను చూసేందుకే ఆహ్వానించారు

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జొహార్ ‘అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది’ అని క్యాప్షన్‌ ఇస్తూ బాలీవుడ్ సూపర్‌స్టార్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. దీనిని చూసిన అభిమానులు కరణ్ తన సొంత బ్యానర్‌లో ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, ఆలియా భట్, దీపికా పదుకొణెలతో సినిమా నిర్మించబోతున్నారని భావించారు. కానీ కరణ్ ఇచ్చిన క్యాప్షన్ వీరందరితో మల్టీస్టారర్‌కి సంబంధించింది కాదని తెలుస్తోంది.

ఆయన పోస్ట్ చేసిన ఫొటో వెనుక మరో విషయం కూడా ఉంది. బిగ్‌ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. బుధవారం రాత్రి ఈ ట్రైలర్‌ను రణబీర్ తన నివాసంలో ప్రదర్శించారట. ఈ ట్రైలర్‌ను చూసేందుకు వారందరినీ రణబీర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కరణ్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ భారీ విజయాన్ని అందుకోనుందన్న ఉద్దేశంతోనే ఆ క్యాప్షన్ ఇచ్చారని అంటున్నారు.

ranabeer kapoor
karan johar
amir khan
deepika padukone
alia bhatt
  • Loading...

More Telugu News