ntr: 'అరవింద సమేత' రిలీజ్ డేట్ ఖరారు

  • ఎన్టీఆర్ - పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత'
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ 
  • పెరుగుతోన్న అంచనాలు   

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రచారం జరిగింది.అయితే అదే రోజున వస్తుందా .. లేదా? అనే సందేహం అభిమానుల్లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11నే విడుదల తేదీగా ఈ సినిమా దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   

  • Loading...

More Telugu News