Asaduddin Owaisi: ఒవైసీ ఆసుపత్రికి భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే.. నోటీసులు!

  • ఒవైసీ ఆసుపత్రికి 6500 గజాల స్థలాన్ని కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
  • రూ. 40 కోట్ల స్థలం రూ.3.75 కోట్లకే అప్పగింత
  • కేసు విచారణ వాయిదా

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బండ్లగూడలో ఒవైసీ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం 6500 గజాల స్థలాన్ని కేటాయించడంపై స్టే విధించింది. రూ. 40 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ. 3.75 కోట్లకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందంటూ అనిషా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.

 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పట్టించుకోకుండా ఒవైసీ సోదరులకు ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని పిటిషన్ లో ఆయన ప్రశ్నించారు. ఒవైసీ సోదరులకు కేటాయించిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఈ ఆసుపత్రికి భూమి కేటాయింపుపై మూడు నెలల వరకు స్టే విధించింది. ఒవైసీ సోదరులకు నోటీసులు జారీ చేస్తూ...తదుపరి విచారణను వాయిదా వేసింది.

Asaduddin Owaisi
Akbaruddin Owaisi
land
High Court
stay
  • Loading...

More Telugu News