amithabh: 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' ట్రైలర్ గురించి రాజమౌళి

  • భారీతనానికి అద్దం పడుతోన్న మూవీ 
  • అమితాబ్ .. ఆమిర్ అందిస్తోన్న విందు 
  • ఆశ్చర్యచకితులను చేసే ఫోటోగ్రఫీ    

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'పై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ .. ఆమిర్ ఖాన్ .. కత్రినా కైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా రాజమౌళి రిలీజ్ చేశారు. "ఈస్ట్ ఇండియా కంపెనీవారు వచ్చిందయితే వ్యాపారం కోసమే .. కానీ ఇప్పుడు అది అధికారం చలాయిస్తోంది. కానీ బానిసత్వానికి తలొగ్గని వాళ్లు కొందరున్నారు" అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ, ఆంగ్లేయులకు .. థగ్గులకు సంబంధించిన పోరాట సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

పాత్రలతో పాటు సినిమా భారీతనాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా వుంది. అందుకే అమితాబ్ .. ఆమిర్ ఖాన్ అద్భుతమైన ట్రీట్ ను అందించారంటూ రాజమౌళి ప్రశంసించాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, టీమ్ కి అభినందనలు తెలియజేశాడు.          

amithabh
amir khan
kathrina
fathima
  • Error fetching data: Network response was not ok

More Telugu News