indian air force: పొరపాటున తనను తానే కాల్చుకున్న ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ శిరీష్ డియో

  • తన తొడలోకి తానే కాల్చుకున్న శిరీష్ డియో
  • హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ కు తరలింపు
  • ప్రస్తుతం నిలకడగా ఉన్న ఆరోగ్య పరిస్థితి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున గాయపడ్డారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు సర్జరీని నిర్వహించిన వైద్యులు... తొడ ఎముకను సెట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.

జూలైలో ఎయిర్ వైస్ చీఫ్ గా శిరీష్ బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్ గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో... అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్ గా శిరీష్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్ కు ఆయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ)గా పని చేశారు. దీనికి తోడు అత్యంత కీలకమైన ఒక ఫార్వర్డ్ బేస్ కు చెందిన సిగ్నల్ యూనిట్ కు చీఫ్ కమాండింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. స్టేషన్ కమాండర్ గా ఎయిర్ ఫోర్స్ లోకి అధునాతన టెక్నాలజీని, సెన్సార్లను ఆయన తీసుకువచ్చారు.

indian air force
vice chief
shirish baban deo
shot
  • Loading...

More Telugu News