Narendra Modi: సంపూర్ణ మెజార్టీ వస్తేనే కేంద్రంలో అధికార పగ్గాలు చేబడదాం!: మోదీ

  • అతుకుల బొంతలాంటి సంకీర్ణ సర్కారు వద్దు
  • అటువంటి ప్రభుత్వాలకు మనుగడ ఉండదు
  • సంఘ్ పరివార్‌ సమావేశాల్లో నేతల మనసులో మాట

'కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగాలి, లేదంటే విపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడాలి' అని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేసినట్లు సమాచారం. మెజార్టీ రానప్పుడు అతుకులబొంతలాంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేమని సంఘ్ పరివార్‌ నేతలతో మోదీ, షా ధ్వయం అన్నట్లు తెలుస్తోంది.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 200 నుంచి 220 సీట్ల మధ్య ఆగిపోతే ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పార్టీ నాయకులు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో మోదీ, షా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నా నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అటువంటి వాటి మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఓకే...లేదంటే విపక్షమే మేలు’ అన్న భావనలో మోదీ ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News