Prabhas: పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రకటన?

  • 39వ పుట్టిన రోజును జరుపుకోనున్న ప్రభాస్
  • పెళ్లి ప్రకటన చేయనున్న కుటుంబ సభ్యులు
  • సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’లో నటిస్తున్న ప్రభాస్

హీరో ప్రభాస్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 23న ఆయన తన 39వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ఈ పుట్టిన రోజు గురించి ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ పుట్టిన రోజున ఆయన కుటుంబ సభ్యులు ఓ కీలక ప్రకటన చేయనున్నారట. అదేమిటంటే, ప్రభాస్ పెళ్లి వార్తను అభిమానులకు వెల్లడించనున్నారని సమాచారం. ప్రస్తుతం... ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇది ప్రేమకథ కావడంతో స్మార్ట్ లుక్ కోసం ప్రభాస్ బరువు కూడా తగ్గాడట. 

Prabhas
bahubali
sahoo
radha krishna
  • Loading...

More Telugu News