Telugudesam: తప్పుడు కూతలు కూస్తున్నారు.. బీజేపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్

  • ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు అసత్యాలే
  • అమరావతి బాండ్లలో ఎలాంటి అవినీతి జరగలేదు
  • జీవీఎల్ తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. అమరావతి బాండ్లు సహా ఏ అంశంపై అయినా బీజేపీ నేతలతో బహిరంగ చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.

చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన అమరావతి బాండ్లలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదన్నారు. బీజేపీ నేత జీవీఎల్ తో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రుణాల కోసం బాండ్లు జారీచేయడం ఆంధ్రాలో తొలిసారేం జరగడం లేదని ఉమ అన్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు బాండ్లు జారీ చేయలేదా? అని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. రామాయపట్నం, దుగరాజపట్నం ఓడరేవుల నిర్మాణం విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Telugudesam
Andhra Pradesh
BJP
Bonda Uma
amaravati bonds
  • Loading...

More Telugu News