alair: నా జీవితంలో ఇవే చివరి ఎన్నికలు.. ప్రకటించిన మోత్కుపల్లి నర్సింహులు!

  • ఆలేరు నుంచి పోటీ చేస్తానన్న నర్సింహులు
  • గోదావరి జలాలు తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటన
  • ప్రజాభీష్టం మేరకే పోటీ చేస్తున్నట్లు వెల్లడి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. రేపు యాదగిరిగుట్టలో శంఖారావ సభ నిర్వహిస్తానని తెలిపారు. తన జీవితంలో ఇవే చివరి ఎన్నికలని, ఆలేరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఆలేరుకు గోదావరి జలాలను సాధించడమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. తాను రాజకీయ నాయకుడిని కాదనీ, ప్రజా సేవకుడిని మాత్రమేనని చెప్పారు. 

alair
Telangana
motkupalli narsimhulu
elections
godavari
  • Loading...

More Telugu News