Konda Surekha: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొండా దంపతులు!

  • ఢిల్లీ వెళ్లిన కొండా దంపతులు 
  • కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్
  • టీఆర్ఎస్ పై నిన్న విరుచుకుపడిన కొండా సురేఖ, మురళి 

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రాజీనామా చేసిన కొండా సురేఖ, మురళీ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీీసీ కార్యాలయానికి చేరుకున్న వీరికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వరంగల్ ఈస్ట్ తో పాటు పరకాల అసెంబ్లీ టికెట్ విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోవడంతో కొండా దంపతులు పార్టీ మారారు. నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొండా దంపతులు.. టీఆర్ఎస్ పైన, కేసీఆర్, కేటీఆర్ లపైనా తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. 

Konda Surekha
murali
Telangana
TRS
Congress
joined
KTR
  • Loading...

More Telugu News