Sexual Harrasment: తనను లైంగికంగా వేధించిన నటుడి పేరు బహిర్గతం చేసిన హీరోయిన్ తనుశ్రీ దత్తా!

  • 2008లో "హార్న్ 'ఓకే' ప్లీజ్" షూటింగ్
  • నానా పటేకర్ తాకరాని చోట తాకాడు
  • సామి సిద్ధిఖీ, రాకేష్ సరాంగ్, గణేష్ ఆచార్య వేధించారన్న తనుశ్రీ

'మీ టూ' ప్రచారంపై స్పందించి, తనకు ఎదురైన లైంగిక అనుభవాన్ని వివరించి వార్తల్లోకి ఎక్కిన హీరోయిన్ తనుశ్రీ దత్తా, నేడు వారి పేర్లను ప్రకటించి సంచలనమే సృష్టించింది. 2008లో "హార్న్ 'ఓకే' ప్లీజ్" చిత్రంలో తాను నటిస్తున్న వేళ, ఓ పాటలో నానా పటేకర్ తో అత్యంత సన్నిహితంగా నటించాల్సి వచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని, తాకరాని చోట తాకాడని చెప్పింది.

ఈ పాట గురించి తనకు ముందుగా చెప్పకుండా షూట్ చేశారని పేర్కొంది. "నేను ఇప్పుడు పేర్లు చెప్పాలని అనుకుంటున్నా. వారు నటుడు నానా పటేకర్, నిర్మాత సామి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సరాంగ్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య".  తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబితే, ఎవరూ పట్టించుకోలేదని కూడా ఆమె ఆరోపించింది.

Sexual Harrasment
Tanusri Dutta
  • Loading...

More Telugu News