Bill Cosby: అత్యాచారం కేసులో హాలీవుడ్ కమెడియన్ బిల్ కోస్బీకి పదేళ్ల జైలు శిక్ష!

  • పదేళ్ల క్రితం స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
  • ఏప్రిల్‌లో దోషిగా తేలిన బిల్ కోస్బీ
  • కోస్బీని ప్రిడేటర్‌గా పోల్చిన కోర్టు

అత్యాచారం కేసులో హాలీవుడ్ టాప్ కమెడియన్ బిల్ కోస్బీ(81) కి పెన్సిల్వేనియా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం కోస్బీ ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసును విచారించిన కోర్టు తాజాగా కోస్బీని దోషిగా తేల్చి శిక్ష విధించింది. కోస్బీని హింసాత్మక లైంగిక ప్రిడేటర్ (సాటి జంతువులను క్రూరంగా చంపి తినే జంతువు)గా పోల్చింది. శిక్షలో భాగంగా కోస్బీ ప్రతీ నెల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే, కోస్బీ తన జీవితాంతం లైంగిక అపరాధిగానే ఉంటారని కోర్టు తేల్చి చెప్పింది.  

టెంపుల్ యూనివర్సిటీ మాజీ అడ్మినిస్ట్రేటర్ అయిన తన స్నేహితురాలు ఆండ్రియా కాన్‌స్టాండ్‌పై 2004లో తన ఇంట్లోనే కోస్బీ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఏప్రిల్‌లో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. తాజాగా శిక్ష ఖరారు చేసింది. #Me Too ఉద్యమంలో తొలిసారి శిక్షకు గురైన సెలబ్రిటీ కోస్బీనే కావడం గమనార్హం. కాగా, కోస్బీ కనీసం మూడేళ్లు జైలులో గడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతడి ప్రవర్తనను బట్టి విడుదలయ్యే అవకాశాలుంటాయి.

  • Loading...

More Telugu News