Andhra Pradesh: కిడారి హత్యలో పాల్గొన్న కామేశ్వరి కోసం భీమవరంలో తనిఖీలు!

  • పక్కా సమాచారంతో పోలీసుల తనిఖీలు
  • 54 బైకులను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • పలువురు అనుమానితులు అదుపులోకి

తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు ఇటీవల కాల్చిచంపిన సంగతి తెలిసిందే. కిడారిని చంపినవారిలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప కూడా ఉంది. హత్య అనంతరం కామేశ్వరితో పాటు మరికొందరు మావోలు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

ఈ నేపథ్యంలో భీమవరంలోని ఇందిరమ్మ కాలనీలో అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 300 మంది పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ తనిఖీల్లో ముగ్గురు పాత నేరస్తులతో పాటు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు 54 బైకులు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో కామేశ్వరి గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.

Andhra Pradesh
cardon search
Police
West Godavari District
  • Loading...

More Telugu News