Vivo V11: వివో నుండి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల!

  • వివో వి11 విడుదల 
  • ఈనెల 27నుండి స్టోర్ లలో లభ్యం
  • రెండు వేరియంట్ లలో లభ్యం

మొబైల్స్ దిగ్గజం వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వి11' ను ఈరోజు విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన వి11 ప్రో స్మార్ట్‌ఫోన్ కి ఇది దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్. రూ.22,990కి లభించే ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో పీ60 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీతో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్లలో లభించే ఈ ఫోన్ సెప్టెంబర్ 27 అర్ధరాత్రి నుండి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఇ- స్టోర్లలో లభించనుంది. అలాగే, పేటీఎం, హెచ్.డీ.ఎఫ్.సీ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి వినియోగదారులు పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందవచ్చు.

వివో వి11 ప్రత్యేకతలు:

  • మీడియా టెక్ హీలియో పీ60 చిప్ సెట్
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 6.3" ఎల్సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (19:9 అస్పెక్ట్ రేషియో)
  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (ఫన్ టచ్ ఓఎస్ 4.5)
  • 16/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3315 ఎంఏహెచ్ బ్యాటరీ 

  • Error fetching data: Network response was not ok

More Telugu News