Duniya Vijay: ఒక్క సిగరెట్ ఇవ్వండి... జైల్లో సిబ్బందిని అడుక్కున్న కన్నడ హీరో విజయ్!

  • ఆదివారం నాడు అరెస్టయిన దునియా విజయ్
  • వైద్య పరీక్షల నిమిత్తం జైలుకు
  • సిగరెట్ అడిగినా అందించని సిబ్బంది
  • బెయిల్ రాలేదని తెలిసి వేదన

ఓ జిమ్ లో గోడవపడి, అక్కడి ట్రైనర్ ను దారుణంగా కొట్టిన ఘటనలో అరెస్టయిన కన్నడ హీరో 'దునియా' విజయ్ కి బెయిలు లభించలేదు. నిన్న వైద్య పరీక్షల అనంతరం విజయ్ ను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన పోలీసులు, ఆయనకు 9035 నంబరును కేటాయించారు. గతంలో శాంతినగర ఎమ్మెల్యే కుమారుడు మహ్మద్ కు కేటాయించిన గదినే ఆయనకు కేటాయించారు.

ఇక జైలులో తొలిరోజు విజయ్ చాలా ఇబ్బందిగా గడిపాడని జైలు సిబ్బంది వెల్లడించారు. ఆయన ఒక్క సిగరెట్ అన్నా ఇవ్వాలని బతిమాలుకున్నాడని అన్నారు. రోజంతా అనీజీగా ఉన్న విజయ్, తెల్లవారుజామున కాసేపు నిద్రపోయి, వెంటనే లేచాడని, ఆయనకు ఈ ఉదయం ఏడు గంటలకు పులిహోర, టీ ఇచ్చామని తెలిపారు. కోర్టులో జామీను లభించలేదని తెలుసుకుని ఆయన వేదనకు గురయ్యాడని అన్నారు.

కాగా, సినిమా రంగంలో ఎదుగుతున్న తనను కొందరు కావాలనే ఈ కేసులో ఇరికించారని విజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోర్టు తనకు బెయిల్ ఇస్తుందని, వెంటనే ఇంటికి వెళ్లవచ్చని విజయ్ భావించగా, బెయిల్ విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. దీంతో నేడు కూడా ఆయన జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Duniya Vijay
Bail
Jail
Kannada
Star
Parappana Agraharam
  • Loading...

More Telugu News