aahan shetty: హిందీలోకి 'ఆర్ ఎక్స్ 100' .. హీరోగా సునీల్ శెట్టి తనయుడు

  • సాజిద్ నడియాడ్ వాలా చేతికి 'ఆర్ ఎక్స్ 100' హిందీ రీమేక్ రైట్స్
  • సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి
  • ఈ సినిమాపై సునీల్ శెట్టి ఆశలు    

తెలుగులో ఈ మధ్యకాలంలో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా 'ఆర్ ఎక్స్ 100' కనిపిస్తుంది. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా, చాలా తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి .. అనూహ్య విజయాన్ని అందుకుంది. దాంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి ఈ కథా వస్తువుపై పడింది. తమిళంలో ఈ సినిమా ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ అవుతోంది.

ఇక హిందీలోను ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాజిద్ నడియాడ్ వాలా చేతికి హిందీ రీమేక్ రైట్స్ వెళ్లాయి. సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. హిందీలోనూ ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనీ .. ఆహాన్ శెట్టి కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని సునీల్ శెట్టి భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News