Subrhmanyaswamy: నల్లధనం పేరుకుపోవడం వల్లే రూపాయి విలువ పతనం: సుబ్రహ్మణ్యస్వామి

  • సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
  • అక్రమార్జన సొమ్ము ఇతర దేశాలకు తరలిపోతోంది
  • డాలర్‌తో పోల్చితే రూపాయి విలువను దెబ్బతీస్తున్నది ఇదే

దేశంలో అక్రమార్జన పెరిగిపోయి బ్లాక్‌మనీ పేరుకుపోతోందని, ఈ డబ్బు విదేశాలకు తరలిపోతుండడంతో ఆ ప్రభావం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువపై ప్రభావం చూపిస్తోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అమెరికా అగ్రరాజ్యం కావడంతో డాలర్‌ విలువ రోజురోజుకీ పెరిగి రూపాయితో గ్యాప్‌ మరింత ఎక్కువవుతోందని వ్యాఖ్యానించారు. ‘రూపాయి పతనాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే. నల్లధనాన్ని అదుపు చేసి రూపాయి విలువ పడిపోకుండా మోదీ ప్రభుత్వం చూడాలి’ అని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు.

Subrhmanyaswamy
Block money
Rupee
  • Loading...

More Telugu News