alchohol: మద్యం మత్తులో పోలీసులపై బూతుపురాణం.. యువకుడి అరెస్ట్!

  • బిహార్ లో విచిత్ర ఘటన
  • మద్యం మత్తులో పోలీసులకే వార్నింగ్
  • సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్న అధికారులు

సాధారణంగా మందుకొట్టిన తర్వాత కొందరు గోలగోల చేస్తారు. రోడ్డుపై సైలెంట్ గా వెళుతున్న వారిని కవ్వించి మరీ గొడవ పెట్టుకుంటారు. అయితే మరికొందరు మాత్రం మందు కొట్టాక అస్సలు అలికిడి చేయకుండా ఇంటికి వెళ్లి పడుకుంటారు. కానీ బిహార్ కు చెందిన ఓ యువకుడు మాత్రం మద్యం మత్తులో పోలీసులనే టార్గెట్ చేసుకున్నాడు. ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి బూతుపురాణం వినిపించాడు. అక్కడితో ఆగకుండా తనతో పెట్టుకుంటే అంతే సంగతులని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు.

బిహార్ లోని బిట్హా గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడు నిన్న పూటుగా మద్యం తీసుకున్నాడు. అనంతరం సెల్ ఫోన్ తో స్థానిక పోలీస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్ కు ఫోన్ చేసి ఇష్టానుసారం తిట్టాడు. తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత పట్నాకు చెందిన ఎస్ఎస్ పీ మను మహారాజ్ కు ఫోన్ కలిపాడు. ఆయన ఫోన్ ఎత్తగానే అసలేం అనుకుంటున్నావ్? అంటూ బూతుపురాణం మొదలుపెట్టాడు. దీంతో తిక్కరేగిన పోలీస్ అధికారులు సెల్ ఫోన్ నంబర్ లొకేషన్ ఆధారంగా శ్రవణ్ ను పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News