Nori dattatreya: ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఆధ్వర్యంలో ఏపీ వైద్యులకు కేన్సర్‌ చికిత్సపై శిక్షణ

  • అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో నోరి భేటీ
  • సొంత రాష్ట్రం కోసం కలిసి పనిచేయాలని కోరిన సీఎం
  • అంగీకరించిన భారతీయ వైద్య ప్రముఖుడు దత్తాత్రేయుడు 

ప్రముఖ కేన్సర్ నిపుణుడు, రాష్ట్రానికి చెందిన నోరి దత్తాత్రేయుడు అమెరికాలో స్థాపించిన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ సంస్థ రాష్ట్రంలోని వైద్యులకు శిక్షణ అందించనుంది. అధునాతన వైద్య విధానాలు, శస్త్రచికిత్స పద్ధతుల్లో నైపుణ్యాలు అలవరుచుకునేందుకు అవసరమైన తర్ఫీదు ఇస్తుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో న్యూయార్క్‌లో ఆదివారం రాత్రి నోరి దత్తాత్రేయుడు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా స్వరాష్ట్రంలో వైద్యసేవలకు అవసరమైన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాధనాలను అందించడంలో సహకరించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేన్సర్‌ చికిత్సా విధానాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణల విస్తృతికి తోడ్పడాలని చంద్రబాబు కోరగా, అందుకు స్పందించిన దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. తన వద్ద శిక్షణ పొందిన వైద్యుల ద్వారా రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లోని కేన్సర్‌ రోగులకు కూడా అధునాతన చికిత్స అందించవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

Nori dattatreya
Chandrababu
cancer training
  • Loading...

More Telugu News