New Delhi: గొడవ పడుతున్న భార్యకు ముద్దివ్వాలని చూస్తే... నాలుక కొరికేసింది!

  • న్యూఢిల్లీలోని రహణోలా ప్రాంతంలో ఘటన
  • ఆర్టిస్టుగా పనిచేస్తున్న కరణ్
  • నాలుక తెగిపోవడంతో మాట్లాడే స్థితిలో లేని కరణ్

తనతో గొడవ పడుతున్న భార్యకు ఓ కిస్ ఇచ్చి ఐస్ చేద్దామనుకున్నాడా భర్త. అదే అదనుగా భావించి తన దగ్గరకు వచ్చిన భర్త నాలుకను చటుక్కున కొరికేసి, తనలోని కోపాన్ని తీర్చుకుందామె. ఈ ఘటన న్యూఢిల్లీ పరిధిలోని రణహోలా ప్రాంతంలో జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, ఆర్టిస్టుగా పనిచేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్న కరణ్ అనే వ్యక్తి వైవాహిక జీవితం అసంతృప్తిగా సాగుతోంది. నిత్యమూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్త కరణ్ తో అతని భార్య గొడవ పెట్టుకుంది. ఈ సమయంలో భార్య కోపాన్ని చల్లార్చేందుకు ఓ లిప్ కిస్ ఇచ్చాడు కిరణ్. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న భార్య, అతని నాలుకను కొరికేసింది. నాలుక తెగిపోవడంతో సఫ్టర్ జంగ్ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. కరణ్ నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం అతను మాట్లాడలేకపోతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

New Delhi
Crime
Karan
Tongue
  • Loading...

More Telugu News