Jana Sena: విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ ఖరారైతే జనసేనలోకి పారిశ్రామికవేత్త కోగంటి

  • హైదరాబాద్‌లో పార్టీ పెద్దలను కలిసి మనసులో మాట వెల్లడి
  • ఈ స్థానాన్ని ఆశిస్తున్న మిత్రపక్షం వామపక్షాలు
  • టికెట్టు కేటాయింపుపైనే సత్యం రాజకీయ నిర్ణయం

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జనసేన పార్టీవైపు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆ పార్టీ పెద్దలను కలిసి తన మనసులో మాట ఆయన వెల్లడించారు. సెంట్రల్‌ సీటు కేటాయిస్తే తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సీటును పలువురు ప్రముఖులు ఆశిస్తున్నారు. పైగా జనసేనను తమ మిత్రపక్షంగా భావిస్తున్న వామపక్షాలు అవగాహన కుదిరితే విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలను అడగాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్‌ సీటు నుంచి తప్ప మరో చోటు నుంచి తాను పోటీ చేసేది లేదని సత్యం స్పష్టం చేస్తుండడంతో, జనసేన పెద్దలు, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

  • Loading...

More Telugu News