barashahid: అలీని వెంటబెట్టుకుని నెల్లూరుకు బయలుదేరిన పవన్ కల్యాణ్!

  • బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
  • శంషాబాద్ నుంచి బయలుదేరిన పవన్, అలీ
  • రొట్టెల పండుగలో పాల్గొననున్న నటులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన మిత్రుడు, నటుడు అలీతో కలిసి ఈ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తెల్లవారుజామున పవన్, అలీ శంషాబాద్ నుంచి రేణిగుంటకు విమానంలో బయలుదేరారు.

రేణిగుంట నుంచి పవన్, అలీలు రోడ్డు మార్గాన నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని రొట్టెల పండుగలో పాల్గొంటారు. అనంతరం అలీతో కలసి బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు.

barashahid
Nellore District
dargah
rottela panduga
  • Loading...

More Telugu News