Narendra Modi: ఇక మోదీకంత సీన్ లేదు: కేటీఆర్

  • మోదీ ముందు ఇకపై ఎన్నో సవాళ్లు
  • సమస్యల నుంచి బయటపడటం సులభం కాదు
  • సిరిసిల్లలో కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపై మోదీకి అంత సీన్ ఉండబోదని, ఇన్ని రోజులు గడిచినట్టుగా ఇకపై ఉండదని అన్నారు. సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, మోదీ ముందు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి నుంచి బయటపడటం సులభం కాదని అన్నారు. 15 మంది ఎంపీలను గెలిపించుకోగలిగితే, అందరూ మన వెంటే ఉంటారని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే 300 సంవత్సరాలు గడిచినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చుండేది కాదని ఆయన అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడం కేసీఆర్ భిక్షేనని, కాంగ్రెస్ నేతలు ఇస్తున్న అడ్డగోలు హామీలు నెరవేర్చడానికి ఆరు రాష్ట్రాల బడ్జెట్ కేటాయించినా చాలదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన సీటునే దక్కించుకోలేని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, 20 సీట్లు గెలిపించుకుని వస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలన ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తోందని అన్నారు.

Narendra Modi
KTR
Telangana
Sirisilla
  • Loading...

More Telugu News