rajnath singh: రాఫెల్ అంశాన్ని వివాదాస్పదం చేయడంలో అర్థం లేదు: రాజ్‌నాథ్

  • హోలాండే వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు
  • స్పందించిన కేంద్ర హోం మంత్రి
  • రాఫెల్‌పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే

ప్రభుత్వం సూచించిన కారణంగానే.. తమకు గత్యంతరం లేని పరిస్థితిలో డసాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను చేర్చుకోవాల్సి వచ్చిందని... నాటి ఒప్పందంపై ఇన్వెస్టిగేటివ్ న్యూస్ జర్నల్ 'మీడియా పార్ట్' ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీనిపై నిజానిజాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రాఫెల్‌పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని, ఈ అంశాన్ని వివాదస్పదం చేయడంలో అర్థం లేదని రాజ్‌నాథ్ అన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని ఇప్పటికే రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

rajnath singh
anil ambani
reliance
media part
  • Loading...

More Telugu News