Pakistan: ద్వైపాక్షిక చర్చలను భారత్ తిరస్కరించడంపై పాక్ ప్రధాని ట్వీట్
- ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఇమ్రాన్ ట్వీట్
- ఎలాంటి లక్ష్యం లేకుండా పని చేయడం తగదు
- మోదీపై ఇమ్రాన్ పరోక్ష వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాలని కోరుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరించడంపై పాక్ ఫ్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు. భారత్ ను తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమంటూ తాము చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని అన్నారు. ఎలాంటి లక్ష్యం లేకుండా పెద్ద కార్యాలయాల్లో కూర్చుని పని చేసే వారిని తన జీవితంలో చాలా మందినే చూశానంటూ భారత ప్రధాని మోదీపై ఇమ్రాన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గురు ఎస్పీఓలను, ఓ బీఎస్ఎఫ్ జవాన్ ని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే పాక్ తో శాంతియుత చర్చలను భారత్ రద్దు చేసింది. శాంతియుత చర్చల నిమిత్తం లేఖ రాసిన పాకిస్థాన్, మరోపక్క సరిహద్దుల్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది.