Chandrababu: కన్నా లక్ష్మీనారాయణపై మండిపడ్డ అనురాధ

  • బీజేపీ, వైసీపీల మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు
  • చంద్రబాబును విమర్శించేంత స్థాయి రామ్ మాధవ్ కు లేదు
  • బీజేపీ, వైసీపీ, జనసేనలు కుట్రలు చేస్తున్నాయి

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీల మధ్య వారధిగా కన్నా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. కాకినాడలో బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేంత స్థాయి రాంమాధవ్ కు లేదని చెప్పారు. చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ, పవన్ కల్యాణ్ లు వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు.

కన్నాపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా మండిపడ్డారు. పార్టీలు మారే ఊసరవెల్లి కన్నా అంటూ విమర్శించారు. నూజివీడులో దేవాలయాల భూములను బినామీల పేర్లతో అనుభవిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ కుంభకోణంపై జీవీఎల్ నరసింహారావు, హరిబాబు, కన్నా ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. 

Chandrababu
ram madhav
Pawan Kalyan
anuradha
panchumarthi
  • Loading...

More Telugu News