Krishna District: కృష్ణా జిల్లాలో అర్చకులు వర్సెస్ ఇరిగేషన్ అధికారులు.. రోడ్డుపైనే పిండప్రదానం చేసిన పురోహితులు!

  • దుర్గాఘాట్ గేటును మూసేసిన అధికారులు
  • ఆందోళనకు దిగిన అర్చకులు
  • వెంటనే గేటును తెరవాలని డిమాండ్

కృష్ణా జిల్లాలో అర్చకులు, ఇరిగేషన్ అధికారులకు మధ్య వివాదం రాజుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద అర్చకులు పిండప్రదానాలు చేయకుండా అధికారులు అటుగా వెళ్లే గేటును మూసివేశారు. దీంతో పలువురు అర్చకులు దుర్గాఘాట్ కు వెళ్లే దారిలో ఆందోళనకు దిగారు. గేటు ముందే పిండప్రదానం చేసి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఈ గేటును అధికారులు మూసివేశారనీ, ప్రభుత్వ జోక్యంతో మళ్లీ తెరిచారని వెల్లడించారు. దుర్గాఘాట్ ను నమ్ముకుని దాదాపు 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయనీ, ఇప్పుడు అధికారులు అడ్డుకుంటే తామెలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే దుర్గాఘాట్ గేట్లను తెరిపించాలని డిమాండ్ చేశారు.

Krishna District
priests
irrigation department
Vijayawada
durga ghat
  • Loading...

More Telugu News