Campus Interviews: క్యాంపస్ నియామకాల్లో 'ఎస్‌ఆర్‌ఎం' ఐఎస్‌టీ రికార్డు.. 3 వేలమందికి ఉద్యోగాలు!
- ఓ విద్యార్థికి ఇన్ఫోసిస్ రూ.38.5 లక్షల వార్షిక వేతనం ఆఫర్
- 1185 మందిని తీసుకున్న ఇన్ఫోసిస్
- ఉద్యోగ మేళాకు తొలిసారి హాజరైన 15 తైవాన్ కంపెనీలు
క్యాంపస్ ఉద్యోగ మేళాలో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌టీ) విద్యార్థులు సత్తాచాటారు. 2019 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన తొలి మేళాలో ఏకంగా మూడువేల మంది విద్యార్థులకు ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలిచ్చేందుకు ముందుకు వచ్చాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు మేళాకు హాజరై ప్రతిభావంతుల కోసం అన్వేషించారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏకంగా 1185 మందికి ఉద్యోగాలిచ్చి తొలిస్థానం దక్కించుకుంది. ‘డ్రీమ్స్ ఆఫర్’ కింద 64 మందికి ఉద్యోగాలివ్వగా, ఇందులో ఓ విద్యార్థికి ఈ సంస్థ 38.5 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేయడం గమనార్హం. టీసీఎస్ 62 మందికి అవకాశం ఇచ్చింది. అమెజాన్, ఉదాన్ డాట్ కామ్, న్యూటనిక్స్, శాఫ్ ల్యాబ్స్ సంస్థలు కూడా పలువురు విద్యార్థులకు అవకాశాలు కల్పించాయి. ఈ జాబ్ ఫెయిర్‌కు తైవాన్‌కు చెందిన 15 కంపెనీలు తొలిసారి హాజరు కావడం గమనార్హం.