Narendra Modi: మోదీని వెనక్కి నెట్టేసిన రాహుల్.. కాంగ్రెస్ చీఫ్ ట్వీట్లలో వ్యంగ్యానికి నెటిజన్ల ఫిదా.. మిచిగాన్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి

  • రాహుల్ ట్వీట్లలో దూకుడు
  • విమర్శలకు కాస్తంత వ్యంగ్యం
  • అధ్యయనంలో వెల్లడి

సోషల్ మీడియాలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంధించే వ్యంగ్యాస్త్రాలకు విశేష ఆదరణ లభిస్తున్నట్టు తేలింది. ఆయన ట్వీట్లలో వ్యంగ్యం, ప్రాస, విమర్శనాత్మకంగా ఉండడమే అందుకు కారణమని తేలింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్, పరిశోధక విద్యార్థి లీ బొజార్ట్‌లు భారత్‌లోని మొత్తం 274 మంది ముఖ్య రాజకీయ నేతలపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో రాహుల్ ట్వీట్లకు అత్యధికంగా ఎక్కువ రీట్వీట్లు వచ్చినట్టు గుర్తించారు. ఆయన ట్వీట్లలోని వ్యంగ్యాస్త్రాలే అందుకు కారణమని తేల్చారు.

గత ఎన్నికల్లో మోదీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఆయన ప్రధాని కావడానికి ఇది కూడా కీలకంగా మారింది. దీంతో ఆయన తర్వాత నేతలందరూ ఇదే బాట పట్టారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, రాహుల్ తాను చేసే విమర్శలకు కొంత వ్యంగ్యం జోడిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. ఇక, చాలామంది నేతలు తమ ట్వీట్లను ప్రాంతీయ భాషల్లో చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.

Narendra Modi
Rahul Gandhi
Twitter
michigan state university
America
  • Loading...

More Telugu News