chandrababu: బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదు: కళా వెంకట్రావు

  • బీసీ గర్జన పేరిట అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ
  • మోసం చేసిన బీజేపీని ప్రజలు ఎలా నమ్మాలి?
  • చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ గెలవడం ఖాయం

బీజేపీకి కేంద్రంలో తప్ప మన రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నేడు కాకినాడలో జరిగింది. ఈ సమావేశానికి కళా వెంకట్రావు, హోం మంత్రి చినరాజప్ప హాజరయ్యారు.

ఈ సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ అక్టోబర్ నెలాఖరున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని ప్రజలు ఎలా నమ్మాలని కళా వెంకట్రావు ప్రశ్నించారు. అనంతరం చిన రాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే బీజేపీని దూరం పెట్టామని చినరాజప్ప స్పష్టం చేశారు.  

chandrababu
kala venkat rao
china rajappa
kakinada
  • Loading...

More Telugu News