aap: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది: సోమనాథ్ భారతి

  • తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తాం
  • మహాకూటమితో సహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోం
  • పోటీ చేసేందుకు వెయ్యి మంది దరఖాస్తు చేశారు

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సోమనాథ్ భారతి వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని, మహాకూటమితో సహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోమని అన్నారు.

119 స్థానాలకు ఆప్ తరపున పోటీ చేసేందుకు వెయ్యి మంది దరఖాస్తు చేశారని, పోటీ చేసేందుకు మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఆప్ అభ్యర్థుల పేర్లు, మేనిఫెస్టోను త్వరలో ప్రకటిస్తామని, తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని సోమనాథ్ భారతి చెప్పారు.

aap
somnath bharathi
Telangana
  • Loading...

More Telugu News