vijay kumar: తన ఇల్లు ఆక్రమించుకుందంటూ.. కూతురిపై సినీ నటుడు విజయకుమార్‌ ఫిర్యాదు

  • షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయని వనిత
  • పోలీసులను ఆశ్రయించిన విజయకుమార్
  • ఈ ఇంట్లో తనకు కూడా వాటా ఉందంటూ వనిత వాదన

ప్రముఖ సినీ నటుడు విజయకుమార్ తన కూతురు వనితపై చెన్నైలోని మధురవాయిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలపాక్కమ్ లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో ఉన్న తన ఇంటిని వనిత ఆక్రమించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఇంటిని సినిమా షూటింగులకు అద్దెకు ఇస్తుంటామని... కొట్టివాక్కమ్ లో ఉన్న మరో ఇంట్లో తన కుమారుడు అరుణ్ తో కలసి నివసిస్తున్నామని తెలిపారు. వారం రోజుల క్రితం తన కుమార్తె షూటింగ్ కోసం అలపాక్కమ్ లోని ఇంటిని అద్దెకు తీసుకుందని... షూటింగ్ పూర్తయినా ఇంటిని ఖాళీ చేయడం లేదని చెప్పారు. ఖాళీ చేయమని అడిగితే... లాయర్లు, రౌడీలతో బెదిరిస్తోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో, వనితపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న అలపాక్కమ్ లోని ఇంటికి వెళ్లి వనితను విచారించగా... ఈ ఇంట్లో తనకు కూడా భాగముందని, అందుకే తాను ఖాళీ చేయనని ఆమె స్పష్టం చేసింది. ఇల్లు మీదని చెప్పడానికి ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గా... వారితో వనిత వాగ్వాదానికి దిగింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లగా... ఫొటోగ్రాఫర్ల కెమెరాలను ఆమె నేలకేసి కొట్టింది. ఇంతకు ముందు నుంచే విజయకుమార్, వనిత కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. 

vijay kumar
actor
daughter
case
vanitha
  • Loading...

More Telugu News