Bangladesh: ఆఫ్'ఘన' విజయం... మట్టికరిచిన బంగ్లాదేశ్!

  • లీగ్ దశలో శ్రీలంకను ఓడించిన ఆఫ్గనిస్థాన్
  • ఫామ్ కొనసాగిస్తూ బంగ్లాదేశ్ కు షాకిచ్చిన పసికూన
  • 137 పరుగుల తేడాతో విజయం

ఆసియా కప్ లీగ్ దశలో శ్రీలంకను ఇంటికి పంపించి, అనూహ్యంగా సూపర్-6కు వచ్చిన ఆఫ్గనిస్థాన్, తన జోరును కొనసాగించింది. తమకన్నా ఎన్నో రెట్లు బలమైన బంగ్లాదేశ్ కు షాకిచ్చి, లీగ్ దశలో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. స్పిన్నర్ రషీద్ ఖాన్ 32 బంతుల్లోనే 57 పరుగులు చేసి మెరిసిన వేళ, మొత్తం 50 ఓవర్లలో 255 పరుగులు చేసిన ఆఫ్గన్, ఆపై బంగ్లాదేశ్ ను 137 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ఆఫ్గన్ ఆటగాళ్లు రషీద్, నయీబ్ లు చెరో రెండు వికెట్లు తీసుకుని రాణించారు. దీంతో 42.1 ఓవర్లలోనే 119 పరుగులకు బంగ్లాదేశ్ పరిమితమైంది. కాగా, నేడు బంగ్లాదేశ్ జట్టు భారత్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ కు చావో, రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టు ఓటమి పాలైతే, గ్రూప్-6 దశ నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్టే.

Bangladesh
Afghanisthan
Cricket
Asia Cup
  • Loading...

More Telugu News