Chandrababu: రాష్ట్ర పన్నుల వల్లే ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువ: బీజేపీ ధ్వజం

  • చంద్రబాబు కుటుంబ డెయిరీకి మాత్రం లాభాలు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం
  • ఉచిత ఇసుకతో వందల కోట్లు వెనకేసుకున్నారు

ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడానికి రాష్ట్ర పన్నులే కారణమని బీజేపీ ఆరోపించింది. నేడు కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ తీర్మానంలో భాగంగా టీడీపీపై బీజేపీ కార్యవర్గం తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో పాల డెయిరీలు నష్టాలతో మూత పడుతుంటే, చంద్రబాబు కుటుంబ డెయిరీ మాత్రం లాభాలతో వృద్ధి చెందుతోందని ఆరోపించింది.

సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించకుండా.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీజేపీ కార్యవర్గం విమర్శలు గుప్పించింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆ మాటనూ బాబు విస్మరించారని మండిపడింది. ఉచిత ఇసుకతో టీడీపీ నేతలు వందల కోట్లు వెనుకేసుకున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News