chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలకు జేసీ తూట్లు పొడిచారు: పోలీసు అధికారుల సంఘం విమర్శలు

  • జేసీ వ్యాఖ్యలపై మండిపడుతున్న పోలీసు అధికారులు
  • నేతల కొమ్ముకాసేందుకు వృత్తిలోకి రాలేదని ఆగ్రహం
  • క్షమాపణ చెప్పాలని డిమాండ్  

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు మండిపడుతున్నారు. శాంతిభద్రతలు ఎక్కడ బాగుంటే అక్కడ అభివృద్ది ఉంటుందన్న.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు జేసీ దివాకర్‌రెడ్డి తూట్లు పొడిచారని పోలీసుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసభ్య పదజాలంతో పోలీసులను జేసీ కించపరిచారని, అందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జేసీ వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థనే కించపరిచేలా ఉన్నాయని అనంతపురం సీఐ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. తాము కూడా రాయలసీమకు చెందినవారమేనని, అసభ్యపదజాలం ఉపయోగించగలమని, రాజకీయ నాయకుల కొమ్ముకాసేందుకు పోలీసు వృత్తిలోకి రాలేదని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జేసీ పోలీసులకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. 

chandrababu
police officers
jc divakar reddy
srinivasa rao
gorantla madhav
  • Loading...

More Telugu News