putin: షూటర్ గా మారిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంటర్నెట్ లో వీడియో వైరల్!

  • సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తయారుచేసిన కలష్నికోవ్
  • షూటింగ్ రేంజ్ కు వెళ్లి పరీక్షించిన పుతిన్
  • అనంతరం కంపెనీ ప్రతినిధులతో చర్చలు

వ్లాదిమిర్ పుతిన్.. అంటే తెలియనివారు ఉండరేమో. గత 18 ఏళ్లుగా రష్యాను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న పుతిన్ అంతకుముందు రష్యన్ నిఘా సంస్థ కేజీబీకి చీఫ్ గా పనిచేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు కొంతకాలం రష్యా ప్రధాని గానూ విధులు నిర్వహించారు. స్వతహాగా ఇంటెలిజెన్స్ అధికారి అయిన పుతిన్ కు గాలివేగంతో దూసుకెళ్లే బైక్ లు అన్నా, కొత్త తుపాకులన్నా మహా ఇష్టం. అప్పుడప్పుడు తన సరదాను వాటితో పుతిన్ తీర్చుకుంటూ ఉంటారు.

తాజాగా ఏకే-47 తుపాకీని తయారుచేసిన కలష్నికోవ్ కంపెనీ కొత్తగా సెమీ ఆటోమేటిక్ తుపాకీని తయారుచేసింది. ఈ నేపథ్యంలో కంపెనీ షూటింగ్ రేంజ్ కు వెళ్లిన పుతిన్ దాన్ని పరీక్షించారు. కళ్లద్దాలు ధరించి ఈ తుపాకీతో లక్ష్యంపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని మీరూ చూసేయండి.

putin
russia
semi automatic weapon
shoot
kalosnikov
  • Error fetching data: Network response was not ok

More Telugu News