Keerthy Suresh: నిరాశలో 'మహానటి' కీర్తి సురేష్

  • 'మహానటితో' ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కీర్తి
  • ఆ తర్వాత ఆమె తలుపు తట్టని ఆఫర్లు
  • బొద్దుగా తయారవడమే కారణం

హీరోయిన్లకు గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా ముఖ్యమే. రెండింట్లో ఏది లేకపోయినా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదనే విషయం అందరికీ తెలిసిందే. గ్లామర్ ఉండి టాలెంట్ లేకపోయినా... టాలెంట్ ఉండి చక్కటి శరీర సౌష్టవాన్ని కోల్పోయినా కెరీర్ ను కొనసాగించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పరిస్థితి కూడా ఇదే. 'మహానటి' సినిమాతో ఎంతో పేరు, అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం నిరాశలో ఉంది.

'మహానటి' సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా ప్రస్తుతం ఆమె చేతిలో 'ఎన్టీఆర్' చిత్రం మాత్రమే ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె సావిత్రి పాత్రను పోషిస్తోంది. సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో కీర్తి సురేష్ నిరాశకు లోనవుతోందట.

కీర్తికి అవకాశాలు రాకపోవడానికి... ఆమె బొద్దుగా తయారవడమే కారణమని చెప్పుకుంటున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న నిత్యామీనన్ కూడా బొద్దుగా తయారై, సినీ అవకాశాలు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా మరో నిత్యామీనన్ అవుతుందేమో అనేది ఫిలింనగర్ టాక్. మరోవైపు, బొద్దు భామలను ఆదరించే తమిళ ఇండస్ట్రీలో మాత్రం కీర్తికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. విక్రమ్ సరసన ఆమె నటించిన 'సామి-2' చిత్రం రేపు విడుదల కాబోతోంది. 'సండాకోజి-2', 'సర్కార్' సినిమాలను ఆమె చేస్తోంది. 

Keerthy Suresh
mahanati
offers
depression
tollywood
ntr
  • Loading...

More Telugu News