vijayasanthi: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్న విజయశాంతి!

  • టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి
  • పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తారని భావిస్తున్న నాయకత్వం
  • ఇప్పటికే టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన విజయశాంతి

తెలంగాణ రాజకీయాల్లో సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

vijayasanthi
tcongress
congress
star campaigner
  • Loading...

More Telugu News