santosh sivan: నిర్మాతలను కుక్కతో పోల్చిన సినిమాటోగ్రాఫర్.. నేడు తేలనున్న వివాదం!

  • ఫన్నీ ట్వీట్ చేసిన సంతోష్ శివన్
  • నిర్మాతల మండలికి ప్రొడ్యూసర్ల ఫిర్యాదు
  • నేడు సమావేశమై చర్చించనున్న మండలి

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ వివాదంలో చిక్కుకున్నాడు. సినీ నిర్మాత ప్రవర్తనను ఓ కుక్క మెమెతో పోల్చుతూ ట్వీట్ చేశాడు. హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు ప్రేమగా ఉండే నిర్మాతలు, సినిమా టెక్నీషియన్స్ దగ్గరకు వచ్చేసరికి కసురుకుంటారన్న అర్థం వచ్చేలా ఓ మెమెను పోస్ట్ చేశాడు. దీనిపై సినిమా నిర్మాతలు సీరియస్ అయిపోయారు.

ఈ మెమెలో ‘హీరోయిన్ కు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద ప్రేమతో ఉన్న కుక్క ఫొటోను, ‘టెక్నీషియన్స్ కు నగదును ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద మరో ఆగ్రహంతో ఉన్న కుక్క ఫొటోను మిక్స్ చేసిన మెమెను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో పలువురు నిర్మాతలు సంతోష్ పై తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్రమత్తమైన శివన్ ట్వీట్ ను డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయమై ఈరోజు సమావేశం కానున్న నిర్మాతల మండలి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

santosh sivan
kollywood
Twitter
dog
producers
  • Loading...

More Telugu News