keerthi suresh: కీర్తి సురేశ్ ఆ సినిమా చేయడం లేదని చెప్పడానికి అదే కారణమట!

  • శశికుమార్ తో సినిమాకి నో 
  • వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్ 
  • త్వరలోనే అధికారిక ప్రకటన  

తెలుగు .. తమిళ భాషల్లో గ్లామర్ పరంగా .. నటన పరంగా కీర్తి సురేశ్ మంచి మార్కులను సంపాదించుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికుమార్ హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై కీర్తి సురేశ్ స్పందిస్తూ .. తాను ఈ ప్రాజెక్టు చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అయితే ఆమె ఇలా చెప్పడానికి కారణం .. దర్శకుడు వెంకట్ ప్రభు ప్రాజెక్టులో చేయడానికి అంగీకరించడమేననే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందట. అందువల్లనే ఆమె శశికుమార్ సినిమాకి కాకుండా వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం వుందట. ఇక శశికుమార్ సినిమాలో కథానాయికగా ఎవరికి చోటు దొరుకుతుందో చూడాలి.  

  • Loading...

More Telugu News