MS Dhoni: ధోనీని డకౌట్ చేసి.. పిచ్‌కు నమస్కరించిన హాంకాంగ్ బౌలర్

  • భారత్‌కు ముచ్చెమటలు పట్టించిన హాంకాంగ్ బౌలర్
  • ధోనీని డకౌట్ చేసిన ఆనందంలో పిచ్‌ను ప్రార్థించిన వైనం
  • పోరాడి ఓడిన హాంకాంగ్

ఆసియాకప్‌లో భాగంగా భారత్-హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. టాస్ గెలిచిన హాంకాంగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తన ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించింది. సెంచరీ వీరుడు శిఖర్ ధవన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ డకౌట్ అయ్యాడు. హాంకాంగ్ బౌలర్ ఎహ్‌షాన్ ఖాన్ బౌలింగ్‌లో స్కాట్ మెక్ కెచ్‌నీకి క్యాచ్ ఇచ్చి ధోనీ వెనుదిరిగాడు.

ధోనీని అవుటు చేసిన వెంటనే ఎహ్‌షాన్ ఖాన్ ఆనందంతో మోకాళ్లపై వంగి పిచ్‌కు తల ఆనించి ప్రార్థించడం అందరినీ ఆకర్షించింది. 33 ఏళ్ల ఖాన్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 286 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు హాంకాంగ్ చెమటలు పట్టించింది. దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరికి 259 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించి 26 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్కృమించింది.

MS Dhoni
Asia cup
Hongkong
Duck Out
Ehsan Khan
  • Loading...

More Telugu News