Narendra Modi: నరేంద్ర మోదీ దగ్గరున్న నగదు కేవలం రూ. 50 వేలు మాత్రమేనట!

  • మొత్తం ఆస్తి విలువ రూ. 2.5 కోట్లు
  • బ్యాంకుల్లో డిపాజిట్లు రూ. కోటి
  • స్వచ్ఛందంగా వెల్లడించిన నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా? కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే. ఆయన దగ్గర నగదు రూపంలో ఉన్నది రూ. 50 వేలు మాత్రమే. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి తన ఆస్తుల లెక్కని చెబుతూ, మోదీ స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను వెల్లడించారు.

ఇందులోని వివరాల ప్రకారం, మోదీ పేరిట బ్యాంకుల్లో కోటి రూపాయల వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్న ఉంగరాలు తదితర బంగారు ఆభరణాల విలువ ఒక లక్ష రూపాయిలు. గాంధీ నగర్ లో ఓ చిన్న స్థలం, వారసత్వంగా వచ్చిన ఓ నివాస గృహం ఆయనకు ఉండగా, వీటి విలువ కోటి రూపాయల వరకూ ఉందని ఆయన తెలిపారు. మోదీ వద్ద కార్లుగానీ, బైకులు గానీ లేవు. ఆయన పేరిట ఎటువంటి బ్యాంకు రుణమూ లేదు. తన పేరిట రూ. 1.59 లక్షల విలువైన ఎల్ఐసీ డిపాజిట్లు కూడా ఉన్నాయని మోదీ వెల్లడించారు.

Narendra Modi
Assets
SBI
LIC
  • Loading...

More Telugu News