Anil Ambani: అనిల్ అంబానీ సంచలన నిర్ణయం.. టెలికం సేవలకు గుడ్‌బై!
- పీకలోతు నష్టాల్లో ఆర్ కామ్
- 2000 సంవత్సరంలో ప్రారంభం
- భవిష్యత్తులో రియాల్టీ రంగంలోకి
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెలికం రంగంలో వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌ను మూసి వేయాలని నిర్ణయించారు. సంస్థ 14వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టెలికం సేవల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు.
అతి తక్కువ ధరలకే టెలికం సేవలను అందించాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఆర్‌కామ్ సేవలను ప్రారంభించినట్టు అనిల్ తెలిపారు. అయితే, ప్రస్తుతం సంస్థ రూ.40 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ రంగం నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు చెప్పారు. మొబైల్ రంగం నుంచి బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు వివరించారు.