jagan: గ్యాలరీ వాక్ చేయండి.. మీకు కూడా అర్థమవుతుంది!: జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన

  • జగన్ కళ్లులేని కబోధిలా మాట్లాడుతున్నారు
  • గ్యాలరీ వాక్ చేస్తే.. పోలవరం ఏ మేరకు పూర్తయిందో అర్థమవుతుంది
  • ఓటమి భయంతోనే జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ అధినేత జగన్ కళ్లు లేని కబోధిలా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ కూడా పోలవరం డ్యామ్ లో గ్యాలరీ వాక్ చేస్తే... ప్రాజెక్టు పనులు ఏ మేరకు పూర్తయ్యాయో అర్థమవుతుందని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పసుపు, కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ. 9 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. కేసుల భయంతోనే బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

jagan
polavaram
gallery walk
gv anjaneyulu
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News