chennuru: చెన్నూరు టీఆర్ఎస్ టికెట్ రగడ.. ఓదేలు అనుచరుడు గట్టయ్య మృతి!

  • బాల్క సుమన్ కు టికెట్ కేటాయించడంతో నిరసన
  • నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసిన గట్టయ్య
  • హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మృతి

తెలంగాణలోని చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించడం టీఆర్ఎస్ లో చిచ్చు రేపింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరుడు గట్టయ్య ఈ నెల 12న బాల్క సుమన్ సమక్షంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు గట్టయ్య మృతి చెందాడు.

ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇందారంకు బాల్క సుమన్ వచ్చిన సందర్భంగా తీవ్ర అలజడి చెలరేగింది. ఓదేలు అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి. 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న గట్టయ్యను తొలుత మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందాడు.

chennuru
gattaiah
odelu
balka sumam
  • Loading...

More Telugu News