sharwanand: గీతా ఆర్ట్స్ బ్యానర్లో దసరాకి మరో సినిమా ప్రారంభం?

- శర్వానంద్ తో శ్రీకాంత్ అడ్డాల
- నిర్మాతగా అల్లు అరవింద్
- దసరాకి లాంచ్ చేసే అవకాశం
లవ్ .. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా శ్రీకాంత్ అడ్డాల తన చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. 'కొత్త బంగారులోకం' .. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలు ఆయన ప్రతిభకి అద్దం పట్టాయి. ఆ తరువాత ఆయన మహేశ్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలు కావడంతో, అవకాశాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి ఆయన తన సత్తాను మరోసారి చాటుకునే ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.
