: టీఆర్ఎస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు: హరీష్ రావు
టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు క్యూలో ఉన్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రానున్న రోజుల్లో వివిధ పార్టీలనుంచి నేతలు బయటకు వచ్చి, టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన తెలిపారు. ఇప్పటికే బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామనగా నిరాకరించామని తెలిపారు. తెలంగాణపై అంకితభావం, సరైన అజెండా ఉంటే తమ పార్టీ అవకాశమిస్తుందని హరీష్ రావు స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో మరింత మంది నేతలు టీఆర్ఎస్ వైపుగా అడుగులు వేస్తారని తెలిపారు.