Rahul Gandhi: మళ్లీ కన్ను కొట్టిన రాహుల్ గాంధీ.. ఈసారి మద్యప్రదేశ్‌లో!

  • మధ్యప్రదేశ్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం
  • భోపాల్‌లో టీ బ్రేక్
  • సెల్ఫీల కోసం పోటెత్తిన అభిమానులు

ఈ ఏడాది జూలైలో ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో రాహుల్ కన్ను కొట్టిన తీరు అప్పట్లో సంచలనమైంది. తాజాగా మరోసారి రాహుల్ కన్ను కొట్టారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ నేతలతో కలిసి టీ బ్రేక్ తీసుకున్నారు. భోపాల్‌లోని ఓ టీస్టాల్ వద్ద అందరూ కలిసి టీ తాగారు.

రాహుల్ టీ బ్రేక్‌కు ఆగడంతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడ్డారు. రాహుల్ నవ్వుతూ సెల్ఫీలకు పోజిచ్చారు. అందరినీ విష్ చేస్తూ హుషారుగా కనిపించారు. ఈ సందర్భంగా తనను పలకరించిన అభిమానులకు అభివాదం చేస్తూ రాహుల్ కన్ను కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ప్రచారంలో రాహుల్ వెంట జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్ వంటి నేతలు ఉన్నారు.

Rahul Gandhi
wink
Madhya Pradesh
Parliament
Congress
  • Loading...

More Telugu News