Mahendra: విద్యార్థి మహేంద్ర ఆత్మహత్య విషయం విని దిగ్భ్రాంతికి గురైన వైఎస్ జగన్!

  • కర్నూలు జిల్లాలో మహేంద్ర ఆత్మహత్య
  • యువత సంయమనం పాటించాలన్న జగన్
  • రాష్ట్రానికి హోదా తెస్తామని హామీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్లే తన అన్న ఉద్యోగం పొందలేకపోయాడన్న మనస్తాపంతో మహేంద్ర అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుసుకుని,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ కు, కర్నూలు జిల్లా జలదుర్గంలో మహేంద్ర ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పార్టీ నేతలు తెలిపారు.

ఆపై మహేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక సాధిస్తుందన్న అభయమిచ్చారు. యువత సంయమనంతో ఉండాలని, తొందరపడి ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని జగన్ సూచించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వస్తుందని, హోదాను సాధించి తీరుతామని అన్నారు.

Mahendra
Sucide
Andhra Pradesh
Jagan
  • Loading...

More Telugu News